- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సిటీ క్రైమ్ : వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక..ఇలా మీ వాట్సాప్ "RTO Traffic Challan.apk2" కు మెసేజ్ వస్తే తస్మాత్ జాగ్రత్త..ఆ ఫైల్ ను ఎట్టి పరిస్థితుల్లో డౌన్ లోడ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్ లను తయారు చేసి దానికి ట్రాఫిక్ చలానా లు అంటూ పేరు పెట్టి పంపిస్తున్నారు. ట్రాఫిక్ చలానా అనగానే చాలామంది ముందు వెనక సరి చూసుకోకుండా దానిని డౌన్ లోడ్ చేస్తున్నారు. ఈ ఫైల్ ఏపీకే ఫార్మాట్ లో ఉండడంతో ఫైల్ డౌన్ లోడ్ కాగానే మీ ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మీ ఫోన్ లో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత డేటాను కూడా దోచేసి మిమ్మల్ని నిండా ముంచేందుకు సైబర్ మోసగాళ్లు సిద్ధంగా ఉన్నారని పోలీసులు వివరిస్తున్నారు. ఈ ఏపీకే ఫైల్ రూపంలో పంపించి దాని ద్వారా కోట్లాది రూపాయాలను సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ చలాన్ రూపంలో వచ్చిన ఏపికే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకొని దాదాపు కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు ఫిర్యాదు చేస్తుండడంతో పోలీసులు ఫోన్ వినియోగాదారులను అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా ట్రాఫిక్ చలానా లంటూ ఎప్పుడు ఏపీకే ఫైల్ ద్వారా వాట్సాప్ లో పంపించరనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరుతున్నారు.






