రాష్ట్రంలో మ‌రో ఘోర ప్ర‌మాదం..ఒక‌రు మృతి, 5 గురికి !

by velandi.Saikiran |

ట్రాక్టర్, టాటా ఏసీ ఢీకొన్న సంఘటనలో ఒక బాలిక మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏ

రాష్ట్రంలో మ‌రో ఘోర ప్ర‌మాదం..ఒక‌రు మృతి, 5 గురికి !
X

దిశ, మధిర: ట్రాక్టర్, టాటా ఏసీ ఢీకొన్న సంఘటనలో ఒక బాలిక మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ కంచకచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన వారు ఆదివారం రాత్రి ఏపీ గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో బారసాల కార్యక్రమానికి వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. స‌రిగ్గా మధిర మండలం ఖాజీపురం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అయేషా ( 17 ) అనే బాలిక మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య సేవల‌ నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story