- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి బోల్తా పడిన ట్రాక్టర్.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి
తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు... కేశంపేట మండలంలోని తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన శ్రీశైలం ట్రాక్టర్ ను జూలపల్లి గ్రామానికి చెందిన బైరపాక ఆంజనేయులు (32) అనే డ్రైవర్ వ్యవసాయ పొలంలో మక్కలు విత్తిన తర్వాత గ్రామానికి తిరిగి వస్తుండగా జూలపల్లి నుండి లింగందాన వెళ్లే రహదారిలో గ్రామ శివారు ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ట్రాక్టర్ పైన ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాను డ్రైవర్ ఆంజనేయులు తల పగిలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఇద్దరు రాజు, గణేష్ అనే వ్యక్తులు ట్రాక్టర్ పై నుండి పక్కకు దుంకడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. మృతునికి భార్య సైదమ్మ ఒక కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ పొలంలో ఇప్పటివరకు కళ్ళముందే ఉండి ట్రాక్టర్ నడిపిన వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడిన విషయం తెలుసుకున్న తలకొండపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.






