- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. అక్కడిక్కడే వ్యక్తి మృతి..
తూప్రాన్ మండలం ఇమంపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

దిశ, తూప్రాన్ : తూప్రాన్ మండలం ఇమంపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గుర్రాల గణేష్(41) అనే వ్యక్తి వృత్తిరీత్యా ప్రైవేట్ వాహన డ్రైవర్ గా మేడ్చల్ లో పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఘనపూర్ గ్రామంలోని ఇంటికి వస్తుండగా ఇమాంపూర్ గ్రామ శివారులో తన ద్విచక్ర వాహనాన్ని ఘనపూర్ గ్రామం నుండి ఇమంపూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ బద్దం మహేష్ కు చెందినట్లు గుర్తించారు, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో గణేష్ తీవ్ర గాయాలతో రోడ్డు కిందకు ఎగిరి పంట పొలాల్లో పడి మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే గణేష్ మృతి చెందాడు అనే మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్, నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ గంగరాజు తెలిపారు.






