- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి టూరిస్ట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం
టూరిస్ట్ బస్సు (Tourist Bus) బోల్తాపడి ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర న్యూయార్క్ (Northern New York)లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టూరిస్ట్ బస్సు (Tourist Bus) బోల్తాపడి ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర న్యూయార్క్ (Northern New York)లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నయాగరా వాటర్ ఫాల్స్ (Niagara Falls) నుంచి టూరిస్టులతో తిరిగి వస్తుండగా.. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి సహా ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమాయంలో ఆ బస్సులో డ్రైవర్‌తో సహా 52 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. సుమారు గాయలైన 40 మందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంటర్‌స్టేట్ 90లో పెంబ్రోక్ ఎగ్జిట్ (Pembroke Exit) సమీపంలో తూర్పు దిశగా ప్రయాణిస్తుండగా బస్సు నియంత్రణ కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. బస్సు పల్టీలు కొట్టిన సమయంలో చాలా మంది ప్రయాణికులు సీట్ బెల్ట్‌లు ధరించకలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, పర్యాటకుల్లో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నట్లుగా సమాచారం.






