- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: పరకామణిలో ఉద్యోగి చేతి వాటం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విజిలెన్స్ టీమ్
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల (Tirumala)లో తనను ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నాడేమో.. ఏమో ఓ ఉద్యోగి ఏకంగా పరకామణి (Parakamani)లో చోరీకి యత్నించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల (Tirumala)లో తనను ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నాడేమో.. ఏమో ఓ ఉద్యోగి ఏకంగా పరకామణి (Parakamani)లో చోరీకి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. టీటీడీ (TTD) ఉద్యోగి పెంచలయ్య (Penchalaiah) రోజు మాదిరిగానే ఇవాళ ఉదయం విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పరకామణి (Parakamani)లో ప్రవేశించిన అతడు సుమారు 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను కొట్టేశాడు. అయితే, కొట్టేసిన ఆ బంగారాన్ని అతడు ఎవరికీ అనుమానం రాకుండా వ్యర్థాలను తరలించే ట్రాలీలో దాచిపెట్టాడు. దీంతో అప్పటికే అప్రమతమైన ఉన్న విజిలెన్స్ టీమ్ (Vigilance Team) పెంచలయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడి నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకుని సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Next Story






