Tiger Attack: రాష్ట్రంలో మరో ఘోరం.. పులి దాడిలో యువతి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-29 05:19:36  IST  )

పులి దాడి (Tiger Attack)లో యువతి ప్రాణాలో కోల్పోయిన ఘటన కొమురం భీం (Komuram Bheem District) జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Tiger Attack: రాష్ట్రంలో మరో ఘోరం.. పులి దాడిలో యువతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ / కాగజ్‌నగర్: పులి దాడి (Tiger Attack)లో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కొమురం భీం (Komuram Bheem District) జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్‌నగర్ (Kagajnagar) మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం (Gannaram) గ్రామానికి చెందిన లక్ష్మి (Lakshmi) అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లింది. ఈ క్రమంలోనే పని నమగ్నమైన లక్ష్మిపై వెనుక నుంచి వచ్చిన పులి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మెడ భాగంలో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో గమనించిన స్థానికులు లక్ష్మిని ఆసుపత్రి తరలించే‌‌లోపే ప్రాణాలు కోల్పోయినట్లుగా వారు తెలిపారు. ఘటన స్థలానికి చెరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పులి జాడ గురించి వారు ఆరా తీస్తున్నారు.

Next Story