- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO VIRAL: ఏటీఎంలో డబ్బులు తీస్తున్నారా? జర భద్రం
ఏటీఎం వద్ద డబ్బులు తీస్తున్న ఓ యువకుడి దుండగులు దారుణంగా మోసం చేశారు. మాటల్లో పెట్టి అతడి ఏటీఎం కార్డునే దోచేశారు. ఆ తరవాత కార్డులోని డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏటీఎం వద్ద డబ్బులు తీస్తున్న ఓ యువకుడి దుండగులు దారుణంగా మోసం చేశారు. మాటల్లో పెట్టి అతడి ఏటీఎం కార్డునే దోచేశారు. ఆ తరవాత కార్డులోని డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో చోటు చేసుకుంది. ఏటీఎం మిషన్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ డబ్బులు డ్రా చేస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాటల్లో ముంచేశారు. తరవాత నెమ్మదిగా సాయం చేస్తున్నట్టు నటించి అతడి కార్డును తీసుకుని చేతిలో చెల్లుబాటు కాని ఏటీఎం కార్డును పెట్టారు.
దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ పుటేజీలో పూర్తిగా రికార్డు అయ్యింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఏటీఎం కార్డు వినియోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం అవుతోంది. సాధారణంగా ఏటీఎం ఒకరు డబ్బులు డ్రా చేసుకున్న తరవాతనే మరొకరు ఎంట్రీ అవ్వాలి. కానీ అలా కాకుండా కొన్నిసార్లు మీరు డబ్బులు డ్రా చేయకముందే కొందరు లోపలికి వస్తారు. అలాంటి సమయంలో వారినే ముందుగా తీసుకోమనడం, లేదా బయటకు వెళ్లమని చెప్పాలి. లేదంటే మోసపోక తప్పదు. వీడియో






