ఢిల్లీలో మరోసారి ఉగ్ర కలకలం... ముగ్గురు అరెస్ట్

by Ajay Maddhiboyina |

దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి క‌ల‌క‌లం రేగింది. ఇటీవ‌ల ఢిల్లీ ఆత్మాహుతి దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా నేడు ముగ్గురు పాకిస్థాని ఉగ్ర‌వాద మ‌ద్ద‌తుదారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గ్యాంగ్ స్ట‌ర్ల నుండి ఉగ్ర‌వాదులుగా మారిన‌ట్టు గుర్తించారు.

ఢిల్లీలో మరోసారి ఉగ్ర కలకలం... ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి క‌ల‌క‌లం రేగింది. ఇటీవ‌ల ఢిల్లీ ఆత్మాహుతి దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా నేడు ముగ్గురు పాకిస్థాని ఉగ్ర‌వాద మ‌ద్ద‌తుదారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గ్యాంగ్ స్ట‌ర్ల నుండి ఉగ్ర‌వాదులుగా మారిన‌ట్టు గుర్తించారు. ఢిల్లీ స్పెష‌ల్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ మాడ్యూల్ అంత‌ర్జాతీయంగా ప‌నిచేస్తుంద‌ని భార‌త్ లోని అనేక రాష్ట్రాల్లో విస్త‌రించిందని గుర్తించారు. న‌వంబ‌ర్ 25న గురుదాస్ పూర్ సిటీ పోలీస్ స్టేష‌న్ ముందు ఇటీవ‌ల వీరు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారని పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్ నిఘా సంస్థ ఆదేశాల మేర‌కు ప‌నిచేస్తున్న గ్యాంగ్ స్ట‌ర్ షాజాద్ భ‌ట్టి నేతృత్వంలోని మాడ్యూల్ ను గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక‌రు పంజాబ్ కు చెందిన హ‌ర్గ‌న్ ప్రీత్ సింగ్ కాగా మ‌రొక‌రు మధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన వికాస్ ప్ర‌జాప‌తి, మూడో వ్య‌క్తి యూపీకి చెందిన ఆరిఫ్ గా గుర్తించారు. వీరు ఇటీవ‌ల గురుదాస్ పూర్ సిటీ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరిన‌ట్టు తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లంలో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు నిందితులను ప‌ట్టుకున్నారు. షాజాద్ భ‌ట్టి సోష‌ల్ మీడియా ద్వారా లేదా ఇత‌ర ప‌రిచ‌యాల ద్వారా యువ‌కుల‌ను నియమించుకుని ఉగ్ర‌కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

Next Story