తమిళనాడులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం

by Gantepaka Srikanth |

తమిళనాడు(Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును అతివేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది.

తమిళనాడులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును అతివేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం(Three Dead) చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ధర్మపురి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విహారయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story