మైపాడు బీచ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

by Gantepaka Srikanth |

నెల్లూరు(Nellore)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్‌(Mypadu Beach)లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.

మైపాడు బీచ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు(Nellore)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్‌(Mypadu Beach)లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకొట్టడానికి తాజిన్, హుమాయూన్, ఆదిల్ అనే ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు గాలించి వెలికి తీయగా, అప్పటికే మృతి చెందారు(Three Students Dead). మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story