కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవ సమాధి

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-23 04:00:59  IST  )

మూడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు సజీవ సమాధి అని విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవ సమాధి
X

దిశ, వెబ్‌డెస్క్: మూడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు సజీవ సమాధి అని విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్ (Indore) పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి మూడు అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింది చిక్కుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు స్పాట్‌లనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ శివం వర్మ (Shivam Varma), పోలీసులు, రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహారాజా యశ్వంత్ రావ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని అలీఫా, ఫహీమ్‌గా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఐదు గంటల వ్యవధిలోనే సహాయక చర్యలు పూర్తి రెస్క్యూ టీమ్‌ను జిల్లా కలెక్టర్ అభినందించారు. అయితే కూలిన భవనాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. భవనం వెనుక భాగం పురాతన కట్టడం కావడంతో భవనం కూలినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కూలిన భవనంలోని ఒక భాగం పక్కనే ఉన్న నిర్మాణంపై పడిందని మేయర్ పుష్యమిత్ర భార్గవ (Pushyamitra Bhargava) తెలిపారు.

Next Story