క‌డ‌ప‌లో పెను ప్ర‌మాదం..మూడు స్కూల్ బస్సులు ద‌గ్ధం

by velandi.Saikiran |

నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

క‌డ‌ప‌లో పెను ప్ర‌మాదం..మూడు స్కూల్ బస్సులు ద‌గ్ధం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం చోటు చేసుకుంది. నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన కడప జిల్లా సిద్ధవటం మండలం కోగటం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని కోగటం గ్రామంలో నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ బస్సులు ఒక్క‌సారిగా అగ్నికి ఆహుతం అయ్యాయి. ఇక ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది.

ఆ తర్వాత అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు అగ్నిమాప‌క అధికారులు. అయితే ఈ సంఘటనలో మూడు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. నిలిపి ఉంచిన బస్సులు కావడంతో ప్రాణాపాయం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా ? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ అగ్ని ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story