- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్య చేసుకున్న మహిళను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు సహా ముగ్గురు మృతి
ఆత్మహత్య చేసుకునేందు ఓ మహిళ స్థానికంగా ఉన్న బావిలో దూకేసింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్య (suicide)కు పాల్పాడింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (Firefighters)కి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన అధికారులు.. మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ అధికారి బావిలోకి దిగారు. ఈ క్రమంలో బావిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో మహిళ సహా.. ఒక అధికారి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ విషాద సంఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం, నెదు వత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మృతులను కొట్టారక్కర ఫైర్ అండ్ రెస్క్యూ యూనిట్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది సోనీ ఎస్ కుమార్ (36), అర్చన (33), శివకృష్ణన్ (22)గా గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికగా హోం నర్సుగా పనిచేస్తున్న అర్చన గత రెండు నెలలుగా శివకృష్ణన్‌తో కలిసి నివసిస్తోంది. బుధవారం రాత్రి, శివ కృష్ణన్ మద్యం తాగి ఇంటికి తిరిగి వచ్చి గొడవ సృష్టించాడు. దీంతో ఆమె శివ కృష్ణన్ మద్యాన్ని ఇంట్లో దాచిపెట్టింది. దీంతో కోపంతో శివకృష్ణన్ ఆమెపై దాడి చేశాడు. ఈ గొడవ తర్వాత, అర్చన తన ఇంటి ప్రాంగణంలోని బావిలోకి దూకడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.






