పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 02:12:07  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల (Piduguralla)కు చెందిన పది మంది కలిసి మినీ వ్యాన్‌లో తిరుమల (Tirumala) దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్దకు రాగానే వారి వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల క్షతగ్రాత్రులను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story