- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారం..
by Mallepaka Hamsa |
యూపీలో దారుణం జరిగింది. మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారానికి పాల్పడ్డారు..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని కొత్వాతిలోని కైలీ ఆస్పత్రికి చెందిన వైద్యుడు లక్నోకు చెందిన ఓ మహిళతో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన మాయమాటలతో ఆమెను నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళను ఆగస్టు 10వ తేదీన ఆసుపత్రికి పిలిపించుకొని హాస్టల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. రూమ్‌లో తన ఇద్దరు వైద్య స్నేహితులు ఉన్నారు. ముగ్గురూ కలిసి అమెపై అత్యాచారం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు వైద్యులపై సెప్టెంబర్ 29న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.
Next Story






