- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
సరదాగా స్నేహితులతో గడపాలని వెళ్లిన విహారయాత్ర వారి జీవితాల పాలిట శాపమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సరదాగా స్నేహితులతో గడపాలని వెళ్లిన విహారయాత్ర వారి జీవితాల పాలిట శాపమైంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. చీరాల (Cheerala) వద్ద కారు బోల్తా పడటంతో (Car Accident) ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. రన్నింగ్ లో ఉన్న కారు చక్రం ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మృతులను కార్తీక్, నాయక్, అజయ్ లుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి, మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుల మరణవార్త విన్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






