రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు చిన్నారులు స్పాట్ డెడ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-27 10:49:47  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ హైవేపై కారును వెనుకనుంచి దూసుకొచ్చిన క్రేన్ బలంగా ఢీకొట్టింది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు చిన్నారులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా(Nandyal, Andhra Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ హైవేపై కారును వెనుకనుంచి దూసుకొచ్చిన క్రేన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ సహా ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. మృతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదాలు విధి రాత కాదని, నిర్లక్ష్య ఫలితమేనని జిల్లా ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎవరి ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా ఇకనైనా ప్రజలు మారాలని కోరారు. భారతదేశంలో ప్రతిరోజు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది మృతి చెందారని, సుమారు 3 లక్షల మంది గాయపడ్డారని తెలిపారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Next Story