ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా డ్రగ్స్ అమ్మకం.. ముగ్గురు అరెస్ట్

by Muthe.Rajitha |

డ్రగ్స్ అమ్మకాలపై నార్కోటిక్ పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. డ్రగ్ అమ్మకం దారులు కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ.. మాదకద్రవ్యాల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా డ్రగ్స్ అమ్మకం.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్స్ అమ్మకాలపై నార్కోటిక్ పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. డ్రగ్ అమ్మకం దారులు కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ.. మాదకద్రవ్యాల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆర్డర్లు తీసుకొని, నైజీరియా వాళ్ల సాయంతో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల దగ్గర రూ.2 లక్షల విలువైన 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయి, 5 మొబైల్స్ పట్టుకున్నారు.

ఇన్స్టా లో ఒకసారి ఆర్డర్ వచ్చాక.. బెంగళూరు నుంచి సంతోష్, సందీప్, శివకుమార్ అనే వ్యక్తులు నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. వీళ్ల నుంచి డ్రగ్స్ కొన్న సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్‌లను కూడా పట్టుకున్నారు. కేసును లోతుగా విచారిస్తున్నామని, మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పారు.

Next Story