- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Police: పెళ్లి చేసుకోవాలని యువతికి బెదిరింపులు..! ఎక్స్‌లో తెలంగాణ పోలీస్ సూచనలు ఇవే!
పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన తాజాగా కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన తాజాగా కలకలం రేపింది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ ఆమె ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులకు దిగాడు ఓ యువకుడు. ఈ ఘటన (Kacheguda Police Station) కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీస్ (Telangana Police) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వేధింపులను మౌనంగా భరించకండని, సోషల్ మీడియాలో కానీ, నేరుగా గానీ ఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురిచేసినా, (Blackmailing) బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. లేదా 100కు డయల్ చేయండి.. మీకు సహాయం చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని కీలక సూచనలు చేశారు.
కాగా, హైదరబాద్‌లోని కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు చెందిన షేక్‌ఇర్షాద్ అలియాస్ పాషా నింబోలి అడ్డాలో నివసించే అన్యమతానికి చెందిన 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవాలంటూ ఏళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధింత విషయాన్ని యువతి వీహెచ్‌పీ నేతలకు సైతం తెలియజేయడంతో స్టేషన్‌కు వచ్చారు. నిందితుడు వీహెచ్‌పీ నేత చొక్కా పట్టకోవడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇర్షాద్ తల్లి సైతం ఎంఐఎం నేతలకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






