- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Threats: కేకే కుమారుడికి బెదిరింపులు.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు వెంకట్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు (K Keshava Rao) కుమారుడు వెంకట్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం రాజకీయంగా (Political) హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని 1,100 గజాల స్థలానికి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టులో గడీల రఘువీర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి పిల్ వేసి వెంకట్‌ను తీవ్రంగా బెదిరింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు రూ.3 కోట్లు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో వెంకట్ ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలోనే తనను వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని వెంకట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (PS) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితులు తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ, భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






