- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా.. అధికార పార్టీ MLA వాచ్‌మెన్‌కు లెటర్ ఇచ్చిపోయిన అగంతకుడు!
ప్రజా ప్రతినిధులకు బెదిరింపులు రావడం సహజమే. కానీ ఈ మధ్యకాలంలో అవి మితిమీరిపోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా ప్రతినిధులకు బెదిరింపులు రావడం సహజమే. కానీ ఈ మధ్యకాలంలో అవి మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, ఎంపీ రఘునందన్ రావు సహా పలువురికి బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చిన విషయం తెలిసిందే. డబ్బులు డిమాండ్ చేయడం, లేకపోతే చంపుతామని బెదిరించడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపే ఏపీ ఎమ్మెల్యేకు వచ్చింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prashanthi Reddy)ని ఓ అగంతకుడు రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. చెప్పిన డేట్‌లోగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు దిగాడు. ఏకంగా ఎమ్మెల్యే ఇంటి వాచ్‌మెన్‌కే ఈ బెదిరింపు లెటర్‌ను ఇచ్చి వెళ్లాడు. ఎమ్మెల్యే ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






