VIDEO: ఈ దొంగ మామూలోడు కాదు.. రూపాయి బబుల్ గమ్‌తో ఏం చేశాడంటే?

by Ajay Maddhiboyina |

దొంగ‌త‌నం చేయ‌డం ఒక ఆర్ట్.. ఆర్టిస్ట్‌ను కూడా అరెస్ట్ చేస్తారా.. అంటూ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఫన్నీగా చెప్పినప్పటికీ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడిలో జరిగిన ఘటన చూస్తే నిజంగానే ఈ దొంగ కళాకారుడని అనిపిస్తుంది.

VIDEO: ఈ దొంగ మామూలోడు కాదు.. రూపాయి బబుల్ గమ్‌తో ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దొంగ‌త‌నం చేయ‌డం ఒక ఆర్ట్.. ఆర్టిస్ట్‌ను కూడా అరెస్ట్ చేస్తారా.. అంటూ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఫన్నీగా చెప్పినప్పటికీ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడిలో జరిగిన ఘటన చూస్తే నిజంగానే ఈ దొంగ కళాకారుడని అనిపిస్తుంది. సాధారణంగా చాలా ఆలయాల్లో హుండీలను దొంగలు మాయం చేసిన ఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే హుండీని ఎత్తుకెళ్లడమో, లేదంటే హుండీ తాళాన్ని బద్దలు కొట్టడమో చేసి అందులోని డబ్బును మాయం చేస్తుంటారు.

కానీ తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దొంగతనంలో దొంగ దర్జాగా చెమట పట్టకుండా డబ్బును మాయం చేశాడు. తన వెంట తెచ్చుకున్న ఓ వైరుకు బబుల్ గమ్ నమిలి దానిని అంటించాడు. తరవాత ఆ వైర్ తో హుండీలోని డబ్బులను మెల్లిమెల్లిగా పైకి లాక్కున్నాడు. అయితే హుండీలో తరచూ డబ్బులు మాయం అవ్వడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు సీసీ టీవీ కెమెరాలు అమర్చగా డబ్బు దొంగలిస్తున్న వీడియోలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందిచడంతో దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజ‌న్లు సైతం షాక్ అవుతున్నారు. video

Next Story