- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహజీవనం చేస్తూ చోరీలు... చివరికి అలా దొరికిపోయిన లవర్స్
సహజీవనం చేస్తూ జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న దొంగ లవర్స్ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులు కావడంతో ఈ జంట దొంగతనాలు

దిశ, వెబ్ డెస్క్: సహజీవనం చేస్తూ జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న దొంగ లవర్స్ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులు కావడంతో ఈ జంట దొంగతనాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోలకి వెళితే పెంటయ్య, వరలక్ష్మి అనే ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కాగా వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో పల్సర్ బైక్ చోరీకి గురైంది.
ఆ బైక్ ను తాము సరదాగా తిరిగేందుకే కొట్టేశారు. ఇక ఈ నెల 7న గజ్వెల్ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకున్నారు. ఆ తరవాత ఆమెకు మద్యం తాగించి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి నగళను దోచుకున్నారు. అక్కడ నుండి పరార్ అవుతూ దండుపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుండి 1.25 గ్రాముల బంగారం, 50 తులాల వెండి, పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.






