- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు సహకార సంఘంలో చోరీ
by Batti.Sumithra |
సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో రైతు సహకార సంఘం (మ్యాక్స్)లో గుర్తు తెలియని దుండగులు 10 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు.

X
దిశ, సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో రైతు సహకార సంఘం (మ్యాక్స్)లో గుర్తు తెలియని దుండగులు 10 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. రాత్రివేళ జరిగిన ఈ చోరీ ఉదంతాన్ని ఉదయం స్వీపర్ గమనించి మ్యాక్స్ ప్రెసిడెంట్ కు తెలిపింది. మంగళవారం ఉదయం మ్యాక్స్ భవనంలో స్వీపర్ ఊడవడానికి వెళ్లి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది.
వెంటనే మ్యాక్స్ ప్రెసిడెంట్ లాక్కడి గంగారెడ్డికి విషయం చెప్పగానే ప్రెసిడెంట్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని వెంటనే డీఎస్పీ జీవన్ రెడ్డికి చరవానితో విషయాన్ని తెలుపటంతో వారు త్వరలోనే చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుంటామన్నారు.
Next Story






