రామకృష్ణాపూర్ పట్టణంలో మరో చోరీ

by Disha Web |
రామకృష్ణాపూర్ పట్టణంలో మరో చోరీ
X

దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో చోరీ జరిగిన విషయం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో స్థానిక జవహర్ నగర్ కు చెందిన పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికుడు లింగాల శంకరయ్య ఆదివారం తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి అదేరోజు ఇంటికి చేరుకునే సరికి ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి ఉన్నాయన్నారు. ఇంట్లో ఉన్న ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ తో పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.


Next Story