పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనం..

by I. Sairam |

పట్టపగలే మండల కేంద్రంలో దొంగతనం జరిగిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది.

పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనం..
X

దిశ, గోపాల్పేట: పట్టపగలే మండల కేంద్రంలో దొంగతనం జరిగిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. స్థానికులు ఇంటి ఓనర్ గాజుల జమ్ములు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం పని నిమిత్తం పొలం దగ్గరకు వెళ్లిన తర్వాత మధ్యాహ్నం ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారం, ఒక లక్ష రూపాయలు, పది నుంచి 15 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు ఇంటి ఓనర్ అయిన గాజుల జమ్ములు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story