వీళ్లు మామూలు దొంగలు కాదుగా.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ..

by Batti.Sumithra |   (  Updated:2025-03-19 16:30:36  IST  )

సహజంగా నివాస గృహాలు, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని నిత్యం మనం వింటూ ఉంటాం.

వీళ్లు మామూలు దొంగలు కాదుగా.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ..
X

దిశ, డోర్నకల్ : సహజంగా నివాస గృహాలు, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని నిత్యం మనం వింటూ ఉంటాం. కానీ పోలీస్ స్టేషన్ లో దొంగలు చోరీకి యత్నించడం అంటే కాస్త విస్మయానికి గురిచేస్తుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇటీవల ఓ ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి చొరబడి బెల్లం తీసుకెళ్తుండగా పోలీసులు గమనించారు. దీంతో ఆ దొంగలను వెంబడించిన పోలీసులు వారిని పట్టుకొని కేసునమోదు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

ఇప్పుడు ఎక్కువ సినిమాలు అలానే వస్తున్నాయి.. నిర్మాతలపై ఈగల్ వింగ్ డైరెక్టర్ సీరియస్

Next Story