బాబోయ్ దొంగలు.. వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన బంగారం ఎత్తు కెళ్ళిన దొంగలు..

by Bhanu |

బాబోయ్ దొంగలు.. వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన బంగారం ఎత్తు కెళ్ళిన దొంగలు..
X

దిశ, మంథని : వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన మంథని మండలంలో చోటు బుధవారం చేసుకుంది. మండలంలోని గద్దలపల్లి (ధర్మారం) గ్రామం కందుకూరి లక్ష్మిబాయి (62) వృద్ధురాలి ఇంట్లో బుధవారం తెల్లవారు జామున సుమారు మూడు గంటల ప్రాంతంలో దొంగలు పడి రెండున్నర తులాల బంగారం మెడతాడు ఎత్తుకెళ్లారు. బాధితురాలు లక్ష్మీబాయి టైలరింగ్ చేస్తూ జీవిస్తుంది.


కొన్నేళ్ల క్రితం ఆమె భర్త కుమారుడు మరణించడంతో ఇంట్లో లక్ష్మీ బాయి, ఆమె కూతురుతో కలిసి నివాసం ఉంటుంది. దొంగతనం జరిగిన రోజు ఆమె కూతురు బంధువుల ఇంటికి వెళ్ళగా లక్ష్మీబాయి ఒకటే ఇంట్లో ఉంది. దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు ఉల్లిక్కి పడ్డారు. వృద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. మంథని పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story