- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంపి ఫేమస్ అయిపోతా’.. అక్కను హత్య చేసేముందు ఇన్‌స్టాలో రోహిత్ రీల్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో తన అక్క రుచిత(21), అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని, ఊర్లో పరువు పోతుందని భావించిన తమ్ముడు రోహిత్(20) రుచిత గొంతును వైరుతో బిగించి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో తన అక్క రుచిత(21), అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని, ఊర్లో పరువు పోతుందని భావించిన తమ్ముడు రోహిత్(20) రుచిత గొంతును వైరుతో బిగించి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అక్క రుచితను చంపే ముందు ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో రోహిత్(Rohit) రీల్ చేశాడు. అతని ఫోన్లో "బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా" అనే రీల్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో పథకం ప్రకారమే ఫేమస్ అయ్యేందుకు అక్క రుచిత(Ruchitha)ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో
Next Story






