యువ‌కుడు దారుణ హ‌త్య

by Ratna Kumari |

యువ‌కుడు దారుణ హ‌త్యకు గురైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలోని తాటివ‌నంలో గురువారం చోటు చేసుకుంది.

యువ‌కుడు దారుణ హ‌త్య
X

దిశ‌, ఎల్క‌తుర్తి : యువ‌కుడు దారుణ హ‌త్యకు గురైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలోని తాటివ‌నంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై న‌రసింహారావు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల కేంద్రానికి చెందిన గోడిశాల విజ‌య్ కుమార్ (36) గీత కార్మికుడు. రోజు మాదిరిగానే క‌ల్లుగీసేందుకు వెళ్లాడు. ఇదే స‌మ‌యంలో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాను వెంట తెచ్చుకున్న పెద్ద క‌త్తితో విచ‌క్ష‌ణ ర‌హితంగా విజ‌య్ కుమార్ ని నరికాడు. దీంతో తీవ్ర‌గాయాల‌తో తాటివ‌నం వ‌ద్ద‌నే ప‌డిపోయాడు. ఇది గ‌మ‌నించిన తోటి గీత కార్మికులు 108 కి స‌మాచారం అందించారు. ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లోనే మృతి చెందాడు. భార్య శ్వేత ఫిర్యాదు మేర‌కు ఎస్సై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. సీఐ పులి ర‌మేష్ సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసి నిందితుడిని ప‌ట్టుకోవాల‌ని ఎస్సై కి సూచించారు. మృతుడికి ఇద్ద‌రు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Next Story