ఉరేసుకొని యువ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

ఉరి వేసుకొని యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.

ఉరేసుకొని యువ‌కుడు మృతి
X

దిశ, మంగపేట : ఉరి వేసుకొని యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల కేంద్రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి రోడ్డులో నివాసం ఉంటున్న చిలుక‌ల అయ్య‌ప్ప రెడ్డి(28) బుధ‌వారం మ‌ధ్యాహ్నం మండలంలోని కమలాపురం ఆర్పీహెచ్ కాలనీ కవ్వాలకుంట చెరువు దగ్గరలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే వివాహం చేసుకున్న అయ్యప్ప రెడ్డి తన పిన తల్లి ఇంట్లో నిర్వహిస్తున్న భోజన హోటల్లో పని చేస్తూ గడుపుతున్నాడు. కొంత కాలంగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి బార్య, తల్లి ఉన్నారు.

Next Story