- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్‌ఫోన్ మింగేసిన మహిళ.. ఆ తర్వాత ఏమైందంటే?
ఏపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ శనివారం సెల్‌ఫోన్ మింగేసింది. ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. వివరాల్లోకి వెళ్లితే... కాకినాడ జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) గత 15 ఏళ్ల నుంచి మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో స్మృతిని కుటుంబసభ్యులు శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు.
అయితే, శనివారం ఆమె దగ్గర ఎవరు లేని సమయంలో కీ ప్యాడ్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. కుటుంబసభ్యులు వచ్చాక మొబైల్ కనిపించకపోవడంతో స్మృతి బెడ్ వద్ద వెతికారు. కనిపించకపోవటంతో రమ్యను ప్రశ్నించగా.. తాను మొబైల్ మింగినట్లు చెప్పింది. దీంతో షాకైన కుటుంబసభ్యులు వెంటనే డాక్టర్లకు సమచారం ఇచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి మొబైల్‌ను తొలగించారు. అయితే అప్పటికే అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. స్మృతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.






