పుట్టింటికి వచ్చి.. మహిళ ఆత్మహత్య

by Ratna Kumari |

దిశ, తంగళ్లపల్లి : పుట్టింటికి వచ్చిన ఓ మహిళ అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు

పుట్టింటికి వచ్చి.. మహిళ ఆత్మహత్య
X

దిశ, తంగళ్లపల్లి : పుట్టింటికి వచ్చిన ఓ మహిళ అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేళ్ల గ్రామానికి చెందిన రజిత(34) అనే మహిళకు నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దీటి సంతోష్ తో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం. భర్త మూడేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోవడంతో అప్పటి నుంచి బాధతో మానసికంగా కృంగిపోయి అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది. వారం రోజుల క్రితం రజిత నేరెళ్లలోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని, ఉన్న ఇనుప రాడుకు, చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి పల్లె అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉపేంద్ర చారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story