ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య‌..!

by Ratna Kumari |   (  Updated:2026-04-01 09:34:58  IST  )

భార్య, భ‌ర్త‌లు క‌లిసి మెలిసి అనోన్యంగా ఉండాల్సిన వారి జీవితంలో చిచ్చు రేగింది. పచ్చని సంసారంలో పరాయి వ్యక్తి ప్రవేశంతో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది.

ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య‌..!
X

దిశ‌, పాల్వంచ రూర‌ల్ : భార్య, భ‌ర్త‌లు క‌లిసి మెలిసి అనోన్యంగా ఉండాల్సిన వారి జీవితంలో చిచ్చు రేగింది. పచ్చని సంసారంలో పరాయి వ్యక్తి ప్రవేశంతో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్న భర్తను కాదని, కన్న బిడ్డల భవిష్యత్ ని మరిచి, ప్రియుడితో కలిసి భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన వైనం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. పాల్వంచ మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన గడికోట ప్రసాద్ (28) కూలి పని చేసుకుంటూ జీవనం కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌సాద్, కృష్ణవేణి దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. గ‌త కొంత కాలంగా వీరి మ‌ధ్య వివాదాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

దారుణానికి ఒడిగ‌ట్టిన భార్య

కృష్ణ‌వేణి త‌న‌ భర్తను వదిలేసి గత 6 నెలలుగా హైదరాబాద్ లోని బోడుప్పల్ లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే కృష్ణవేణి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు తెలిపారు. మార్చి 25న కృష్ణ‌వేణి ప‌థ‌కం ప్ర‌కారం.. భ‌ర్త ప్ర‌సాద్ కి ఫోన్ చేసి హైద‌రాబాద్ కి రావాల‌ని ప్రేమ‌గా మాట్లాడింది. హైద‌రాబాద్ వెళ్లిన త‌రువాత త‌న సుఖానికి భ‌ర్త అడ్డు వ‌స్తున్నాడ‌నే క‌క్ష‌తో ప్రియుడితో క‌లిసి ప్ర‌సాద్ పై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసిన‌ట్టు ఆరోపించారు. భార్య కృష్ణ‌వేణి, ఆమె ప్రియుడు క‌లిసి ప్ర‌సాద్ ను క‌డుపులో పేగులు క‌మిలిపోయి ప‌గిలిపోయేలా విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి.. పిడిగుద్దుల‌తో దాడి చేసి హింసించార‌ని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్ర‌సాద్ అక్క‌డి నుంచి త‌ప్పించుకొని సొంత గ్రామానికి చేరుకున్నాడు. రెండు రోజుల త‌రువాత చింతూరు ప‌నికి వెళ్ల‌గా.. ప‌ని చేస్తున్న క్ర‌మంలో అత‌నికి క‌డుపులో తీవ్ర నొప్పి వ‌చ్చింది. దీంతో స్థానికులు భ‌ద్రాచ‌లం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డి వైద్యులు ప‌రీక్షించి.. కొత్త‌గూడం ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. కొత్త‌గూడెం డాక్ట‌ర్లు ప‌రీక్షించి ఖ‌మ్మం లేదా వ‌రంగ‌ల్ తీసుకెళ్లాల‌ని చెప్ప‌డంతో ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు కొత్త‌గూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి వెంట‌నే స‌ర్జ‌రీ చేయాల‌ని చెప్పారు. కుటుంబ స‌భ్యులు స‌ర్జ‌రీ చేయించిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ప్ర‌సాద్ మ‌ర‌ణించ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌య్యారు.

అనాథ‌లైన చిన్నారులు

ప్ర‌సాద్ మ‌ర‌ణంతో త‌న ఇద్ద‌రు చిన్నారులు అనాథ‌లు అయ్యారు. తండ్రి ప్రాణాలు కోల్పోవ‌డంతో త‌ల్లి క‌ట‌క‌టాల పాల‌య్యే ప‌రిస్థితి రావ‌డంతో ఆ ప‌సికందుల రోద‌న‌లు మిన్నంటాయి. ఇది చూసిన వారి హృద‌యాల‌ను క‌లిచివేసింది.

క‌న్న‌త‌ల్లి క‌డుపుకోత‌.. పోలీసుల‌కు ఫిర్యాదు

త‌న కొడుకు మ‌ర‌ణం వెనుక కోడ‌లు కృష్ణ‌వేణి, ఆమె ప్రియుడి హ‌స్తం ఉంద‌నే అనుమానంతో మృతుడి త‌ల్లి క‌న్నీరు మున్నీర‌వుతూ పోలీసుల‌ను ఆశ్రయించారు. త‌న కొడుకును అన్యాయంగా చంపేశార‌ని.. నిందితుల‌ను కఠినంగా శిక్షించాలని ఆమె పాల్వంచ మండల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క‌ట్టుకున్న‌ భర్తను భార్య, ప్రియుడు క‌లిసి చంప‌డం పాల్వంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "కామం మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుందిష అని అనడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు.

తండ్రితో గొడవ.. కూతురిపై ఇనుపరాడ్డుతో ఆటోడ్రైవర్ ప్రతీకారం (వీడియో)

Next Story