భర్త బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని ఆత్మహత్య చేసుకున్న భార్య

by Disha Web Desk 6 |
భర్త బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని ఆత్మహత్య చేసుకున్న భార్య
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై తమ ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వార్తల్లో చాలానే చూస్తున్నాం. వారికి నచ్చింది చేయడానికి ఎవరైనా అడ్డుపడితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ జంట నివాసం ఉంటుంది. అయితే భార్య బ్యూటీ పార్లర్‌కు వెళతానని భర్తతో చెప్పింది. దానికి భర్త నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. అది గమనించిన ఆమె భర్త పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.



Next Story

Most Viewed