Vizag: వివాహిత హత్యకు కారణమిదే.. వెల్లడించిన పోలీసులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-03 08:10:00  IST  )

విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి ఫార్చ్యూన్ లేఔట్ సమీపంలో వెలుగుచూసిన వివాహిత హత్యకేసులో భీమిలి పోలీసులు పురోగతి సాధించారు.

Vizag: వివాహిత హత్యకు కారణమిదే.. వెల్లడించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి ఫార్చ్యూన్ లేఔట్ (Dakamarri Fortune Layout) సమీపంలో వెలుగుచూసిన వివాహిత హత్యకేసులో భీమిలి పోలీసులు (Bheemili Police) పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని వెల్లడించారు. నిందితుడు దివీస్ లో పనిచేస్తున్నాడని గుర్తించినట్లు తెలిపారు. కత్తితో వివాహిత గొంతుకోసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని వివరించారు.

శుక్రవారం (మే2) ఫార్చ్యూన్ లేఔట్ సమీపంలో వివాహిత మృతదేహం సగం కాలిన స్థితిలో కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వివాహిత మృతికి కుటుంబ కలహాలు కారణమా? వివాహేతర సంబంధమా? లేక అత్యాచారం చేసి హతమార్చారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల దర్యాప్తులో ఉన్నట్లు సమాచారం.

Next Story