వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

దిశ‌, గాంధారి : వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. అయితే మండ‌ల కేంద్రానికి చెంని ఒడుసుల చిరంజీవి(30) అనే వ్య‌క్తి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ఎస్ఐ ఆంజ‌నేయులు తెలిపారు.

వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, గాంధారి : వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. అయితే మండ‌ల కేంద్రానికి చెంని ఒడుసుల చిరంజీవి(30) అనే వ్య‌క్తి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ఎస్ఐ ఆంజ‌నేయులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు గత కొద్ది రోజులుగా మద్యానికి బానిస కాగా, కుటుంబ సభ్యులు మద్యం మానేసి పని చేయమన్నందుకు రెండు రోజుల క్రితం గత నెల 31రోజు తన ఇంట్లో ఎవరు లేని సమయం చూసి గుర్తు తెలియని పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి అశ్విని హాస్పిటల్ కి తీసుకువెళ్ళగా.. అక్క‌డ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు అని వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు ఆయన తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు..

Next Story