ప్రైవేట్ స్కూల్ టీచర్ హత్యలో వీడిన మిస్టరీ.. నమ్మించి అక్కడికి తీసుకువెళ్లి దారుణం

by Prasad Jukanti |

టీచర్ హత్య కేసులో హంతకుడు ఓ సినిమా నుంచి ప్రేరణ పొందినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

ప్రైవేట్ స్కూల్ టీచర్ హత్యలో వీడిన మిస్టరీ.. నమ్మించి అక్కడికి తీసుకువెళ్లి దారుణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. అయిన వారే దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ప్రైవేట్ స్కూల్ టీచర్ హత్య కేసులో (private school teacher murder) సినిమాను తలదన్నే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చాలెంజ్ విసిరిన ఈ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. మంబయిలోని పూణేలో జరిగిన ఈ క్రైమ్ సీన్‍లో (Pune murder case) కట్టుకున్నవాడే కాలయముడిగా మారినట్లు పోలీసులు గుర్తించారు. పూణెలోని శివానే ప్రాంతంలో నివసించే సమీర్ జాదవ్, అతని భార్య అంజలి సమీర్ జాదవ్ (38) 2017 లో వివాహం చేసుకున్నారు. సమీర్ జాదవ్ ఆటోమొబైల్ డిప్లొమా చదవి ఒక గ్యారేజీని నడిపిస్తుండేవాడు. అంజలి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‍గా పని చేస్తోంది. వీరికి మూడు, ఐదు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తాను అద్దెకు తీసుకున్న కొత్త గోదామును చూపిస్తానంటూ నమ్మబలికిన జాదవ్ తన భార్యను గత అక్టోబర్ 26న అక్కడికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కొలిమిలో ఆమె మృతదేహన్ని కాల్చి ఆ బూడితను సమీపంలోని నదిలో పారేశాడు.

బాయ్ ఫ్రెండ్ ను సృష్టించి..

ఈ హత్య చేసిన తర్వాత జాదవ్ తన భార్య మిస్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన సమీర్ జాదవ్.. కేసు దర్యాప్తును పక్క దారి పట్టించేందుకు తన భార్య సెల్ ఫోన్ నుంచి తన స్నేహితులలో ఒకరికి 'ఐ లవ్ యూ' అనే సందేశం పంపించారు. దాంతో అంజలికి ఇతరులతో ఎఫైర్ ఉందనే అనుమానం కలిగించాడు. ఆ తర్వాత తన భార్య తప్పిపోయిందని పెట్టిన కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పోలీసుల ముందు తన భార్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే ఉన్నాడు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో భర్త తీరుపై అనుమనం కలిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, సాంకేతిక ఆధారాలను బట్టి జాదవ్‍ను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన భార్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించినట్లు డిప్యూటీ కమినషర్ ఆఫ్ పోలీస్ సంభాజీ కదమ్ వెల్లడించారు. అయితే ఈ మర్డర్ చేసేందుకు ఆయన దృశ్యం సినిమా నుంచి ప్రేరణ పొందానని హత్యకు ముందు నాలుగు సార్లు ఆ సినిమా చూసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వార్జే మాల్వాడి స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం రాజ్‌గడ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Next Story