- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో తల్లిని హతమార్చిన హంతకుడు
ఆస్తి కోసం కన్నతల్లిని హతమార్చిన కుమారుడు, అతనికి సహకరించిన మహిళ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన చౌదరి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం : ఆస్తి కోసం కన్నతల్లిని హతమార్చిన కుమారుడు, అతనికి సహకరించిన మహిళ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన చౌదరి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రావిర్యాల గ్రామానికి చెందిన పోచమ్మ (మృతురాలు), హనుమయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు భీమయ్య గత కొంతకాలంగా పద్మమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి పేరు మీద ఉన్న సుమారు 27 గుంటల భూమిని భీమయ్య తన తల్లికి తెలియకుండా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ భూమి విషయమై, అలాగే ప్రభుత్వం నుంచి లభించే ఇందిరమ్మ ఇళ్లు, పింఛను డబ్బుల విషయంలో భీమయ్య, పద్మమ్మలు తరచూ పోచమ్మతో గొడవ పడుతూ ఉండేవారు.
ఈ క్రమంలో ఈ నెల 2న (శనివారం) తెల్లవారుజామున పోచమ్మ తన ఇంటి బయట మంచంపై మృతదేహంగా కనిపించింది. మృతురాలి ముఖం, గొంతు, శరీర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్తి మొత్తం తమకే దక్కాలనే ఉద్దేశంతో, అడ్డుగా ఉన్న తన తల్లిని భీమయ్య, పద్మమ్మలు పథకం ప్రకారం.. హతమార్చినట్లు మృతురాలి కుమార్తె దాసరి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై సమాచారం అందిన వెంటనే SHO కె. విజయ్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసి అతి తక్కువ సమయంలోనే నిందితులైన భీమయ్య, పద్మమ్మలను అదుపులోకి తీసుకున్నారు.






