- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
by Sridhar Babu |
అదృశ్యమైన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, చేగుంట : అదృశ్యమైన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేగుంట ఎస్సై చైతన్య కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మక్కరాజుపేట గ్రామానికి చెందిన అంతు నరసయ్య (69) గత నెల 14వ తేదీన ఇంటి నుండి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్లాడు. రెండు రోజులపాటు ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి మక్క రాజుపేట గ్రామ శివారులోని లింగకుంట చెరువులో గుర్తుతెలియని శవం ఉందన్న సమాచారం పోలీసులకు స్థానిక రైతులు అందించారు. దాంతో ఆదివారం ఉదయం స్థానిక పోలీసులు చెరువులో కుళ్లిపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం నరసయ్యదేనని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
- Tags
- person died
Next Story






