భర్త టార్చర్ పెడుతున్నాడని భార్య మాస్టర్ ప్లాన్.. చివరకు ఏం జరిగిందంటే?

by Disha Web Desk 9 |
భర్త టార్చర్ పెడుతున్నాడని భార్య మాస్టర్ ప్లాన్.. చివరకు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో భర్యభర్తలిద్దరూ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం కామన్ అయిపోయింది. కాగా.. తరచూ గొడవ పడటం, డివోర్స్ తీసుకోవడం, భార్యలను కొట్టడం, చంపడం లాంటివి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్టంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నోయల్ పేన్ అనే వ్యక్తి తన భార్య (రెబెక్కా)నే తరచూ కొడుతూ, నీచమైన మాటలతో తిడుతూ నరకం చూపించేవాడు. అసభ్యకర వీడియోలు చూడమని బలవంతం చేసేవాడు. సిగరేట్‌తో కాల్చడం, ఆమెపై పదే పదే ఉమ్మడం, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు.

అలాగే ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చి తన ప్రేయసిగా రెబెక్కాకు పరిచయం చేసిందే కాక, వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. దీంతో ఏం చేయాలో అతడి భార్యకు అర్థం కాలేదు. ఎదురు తిరిగి మాట్లాడితే భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేదు. ఈ క్రమంలో అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నోయల్ బతికి ఉండగా వదలడం సాధ్యం కాదని ఓ ప్లాన్ వేసింది. నిద్ర మాత్రలను తీసుకొచ్చి, వాటిని ఐసింగ్ షుగర్‌లా మార్చింది. వాటితో బిస్కెట్లు తయారు చేసి భర్తకు పెట్టడంతో వెంటనే సృహ తప్పిపోయాడు. కొంత సమయం తర్వాత మరణించాడు. ప్రస్తుతం రెబెక్కాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story