మూత్రంతో ఇల్లు తుడిచిన పనిమనిషి.. సీసీ కెమెరాలో రికార్డైన (వీడియో)

by Disha Web Desk 6 |
మూత్రంతో ఇల్లు తుడిచిన పనిమనిషి.. సీసీ కెమెరాలో రికార్డైన (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్తుండటం వల్ల ఇంట్లో పనులు చేసుకోవడానికి తీరిక ఉండదు. పట్టణాల్లో చాలా మంది పని మనిషిని పెట్టుకుంటారు. కానీ, అలాంటి సమయంలో వారు ఎలాంటి వారు అనే విషయాన్ని తెలుసుకోకుండా పెట్టేస్తారు. కొంత మంది మాత్రం సని చేతకాక దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో అజ్ నారా హోమ్స్ సొసైటీలో అలోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతను పని మనిషిని పెట్టుకున్నాడు. రోజూ ఆమె వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తుంది. అయితే, అలోక్ సింగ్ ఓ రోజు ఎందుకో.. తన సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాడు ఓ ఇంట్లో పని మనిషి తన మూత్రంతో ఇంటిని తుడుస్తోంది. అది చూసిన అలోక్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వెలుగులోకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ పని మనిషి తన నేరాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed