- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ మెడలో గొలుసు చోరీ..
by Vinod kumar |
మహిళ మెడలో గొలుసు చోరీ జరిగిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, నాగారం: మహిళ మెడలో గొలుసు చోరీ జరిగిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కీసర మండలంలోని నాగారంలోని రాసుఖ్ నగర్ కాలనీలో పాపని స్కూల్లో వదిలి ఇంటికి వస్తున్న క్రమంలో వినోద అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగుడు ద్విచక్రవాహనంపై వచ్చి చోరీ చేసి 7 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. మహిళ చాకచక్యంగా వ్యవహరించి కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు 100కు డయల్ చేయగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






