- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కాదు.. వీడు 'మృగం'.. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ రాక్షసుడు!
రక్షణగా ఉండాల్సిన తండ్రే భక్షకుడిగా మారాడు. రక్త సంబంధాన్ని మరిచి, కనిపెంచిన కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: రక్షణగా ఉండాల్సిన తండ్రే భక్షకుడిగా మారాడు. రక్త సంబంధాన్ని మరిచి, కనిపెంచిన కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సదరు నిందితుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా తన పెద్ద కుమార్తెపై ఆ తండ్రి విచక్షణ కోల్పోయి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య, అతడిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. తన కుమార్తెపై భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుసుకున్న భార్య అతడితో తీవ్రంగా గొడవ పడింది. ఇంట్లో గొడవ పెద్దది కావడంతో, తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే వెలుగులోకి..
పుట్టింటికి వెళ్ళిన రెండు రోజుల తర్వాత బాధిత బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, బాలికపై జరిగిన అఘాయిత్యం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ మృగంలా ప్రవర్తించిన ఆ తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






