Sigachi Explosion : కొనసాగుతున్న సిగాచీ మృతుల వేట.. కీలక ఆధారాలు లభ్యం

by Muthe.Rajitha |   (  Updated:2025-07-06 14:41:48  IST  )

సిగాచీ పేలుడు(Sigachi Explosion) ఘటనలో ఇప్పటి వరకు ఆచూకీ దొరకని మృతుల వేట కొనసాగుతోంది.

Sigachi Explosion : కొనసాగుతున్న సిగాచీ మృతుల వేట.. కీలక ఆధారాలు లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : సిగాచీ పేలుడు(Sigachi Explosion) ఘటనలో ఇప్పటి వరకు ఆచూకీ దొరకని మృతుల వేట కొనసాగుతోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం(Pashamailaram) పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా మరో 9 మంది కార్మికుల జాడ తెలియరాలేదు. వీరి కోసం ప్రమాద స్థలంలో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అయితే శరీర అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

పురావస్తు శాఖ టెక్నిక్ తరహా ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు అధికారులు. ఈ ప్రక్రియలో వెంట్రుకలు, మాంసం ముద్దలు, ఎముకలు, రక్తం మరకలతో ఉన్న రాళ్లు, కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి. ఇప్పటివరకు 70కి పైగా శాంపిల్స్ సేకరించగా, వాటి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. బాధిత కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.

Next Story