ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది

by Taduka Kalyani |

షాబాద్ మండలంలో ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్ అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది
X

దిశ, షాబాద్: షాబాద్ మండలంలో ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్ అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో బాధితుల ఇంటి వద్ద మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్య పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండించారు.సైకో గా మారి అభం శుభం తెలియని పిల్లలు, వృద్ధులను కిరాతకంగా హతమార్చడం దుర్మార్గమైన, హేయమైన చర్యగా మహేందర్ రెడ్డి అభివర్ణించారు.మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబంలో అనాథగా మిగిలిన దివ్యాంగురాలు మేఘనకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రూ. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అంశం కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. మేఘనకు వైద్యం, పునరావాసం కోసం కలెక్టర్ నారాయణ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ ను సస్పెండ్ చేశారని సీఐ కి శాఖాపరమైన నోటీసులు ఇచ్చారని వివరించారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పామెన భీం భరత్... మాట్లాడుతూ.. నిందితుడు చేసిన మారణకాండకు రాష్ట్రం మొత్తం హడలిపోయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు జడల రాజేందర్ గౌడ్, తమ్మలి రవిందర్, వెంకట్ యాదవ్, ఆరిఫ్ రామస్వామి, మాణిక్ రెడ్డి, అస్మత్ పాషా, ఉప సర్పంచ్ దండు రాహుల్, వారి వెంట ఉన్నారు.

Next Story