కూతుళ్ల బాత్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. 900 వీడియోలు రికార్డ్ చేసిన తండ్రి!

by Disha Web Desk 6 |
కూతుళ్ల బాత్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. 900 వీడియోలు రికార్డ్ చేసిన తండ్రి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఇంట్లో.. బయట ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. తండ్రి తన కూతురికి ఏ కష్టం రాకుండా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవాల్సి తండ్రే కూతుళ్ల విషయంలో నీచానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాము. తాజాగా, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ తండ్రి తన కూతుళ్ల బాత్ రూమ్స్‌లో ఏకంగా సీసీ కెమెరాలు పెట్టి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దంపతుల ముగ్గురు కూతుళ్లతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే మహిళ భర్త తన కూతుళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించి ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఎవ్వరూ లేని సమయం చూసుకుని ఇంట్లో ఉన్న అన్నీ బాత్‌రూమ్స్‌లో సీసీ కెమెరాలను పెట్టాడు. అప్పటి నుంచి భార్య, కూతుళ్ల అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అతని భార్య ఇళ్లు శుభ్రం చేస్తుండగా బాత్రూమ్‌లో సీసీ కెమెరా చూసి షాక్ అయ్యింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్తను నిలదీసింది. కానీ, అతడు నాకు ఏం తెలియదంటూ ఆమె దగ్గర నటించాడు. మహిళకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు విస్తుపోయే నిజాలు చెప్పి వారిని షాక్‌కు గురి చేశాడు. బాత్‌రూమ్స్‌లో సీక్రెట్‌గా కెమెరాలు పెట్టి దాదాపు 900లపైగా వీడియోలను రికార్డ్ చేసి రోజూ చూస్తున్నట్లు వెల్లడించాడు. అయితే అతడు రికార్డ్ చేసుకున్న ఈ అశ్లీల వీడియోలను ఎవరికైనా పంపాడా? అసలేం జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.


Next Story