- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిలిండర్ పేలిన ఘటనలో మృతుడు మెదక్ జిల్లా వాసిగా గుర్తింపు
మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఈ నెల 4వ తేదీన రాత్రి సిలిండర్ పేలి ఇల్లు కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభించింది.

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఈ నెల 4వ తేదీన రాత్రి సిలిండర్ పేలి ఇల్లు కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభించింది. ఘటన జరిగిన రోజు మార్కెట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి ఎగిరి పడిన వచ్చిన భవన శకలాలు తగిలి గాయపడిన యువకుడు కొద్దిసేపటికి మృతి చెందిన విషయం తెల్సిందే. సోమవారం రాత్రి ఘటన జరిగితే బుధవారం ఆచూకీని లభించింది. మెదక్ జిల్లా మెదక్ మండలం మక్త భూపతిపూర్ కు చెందిన కర్రోళ్ల శివరాం, రాంబాయి దంపతుల కుమారుడు కర్రోళ్ల మురళి (25). బతుకుదెరువు బాటలో మేడ్చల్ కు దాదాపు 8 ఏండ్ల కిందట వలస వచ్చాడు. స్నేహితులతో కలిసి పట్టణంలో వివేకానంద విగ్రహం సమీపంలో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఫ్లిప్కార్టులో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత భోజనం అయిన తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చాడు.
ఆ సమయంలో ఒక స్నేహితుడు గదిలోనే ఉండగా, మరొకరు రాత్రిపూట విధులకు వెళ్లారు. మార్కెట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మురళీ పేలుడుతో ఎగిరిపడి వచ్చిన శకలాలతో తీవ్రంగా గాయపడి, మృతి చెండాడు. తనతో పాటు గదిలో ఉన్న స్నేహితులు రాత్రి బయటికి వెళ్లి తిరిగి రాని విషయాన్ని మంగళవారం ఉదయం గుర్తించి, అతని సెల్ ఫోన్ కు కాల్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. మురళీ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అతనితో మాట్లాడేందుకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. మురళీ తో పాటు అద్దె గదిలో ఉండే వారిని అడిగితే సోమ రాత్రి బయటికి వెళ్లి, తిరిగి రాలేదని చెప్పారు. రెండు రోజుల వరకు కూడా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మురళీ కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. పోలీసులు ఎప్పటి నుంచి కనిపించకుండా పోయాడని వాకబు చేసి, సోమవారం జరిగిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఫోటో చూయించారు. ఫొటోలో ఉన్న వ్యక్తి చూసి వారు మురళీ గా గుర్తించారు.






