- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తను హతమార్చిన కోడలు..!
మానవ సంబంధాలు రోజు రోజుకు దిగ జారిపోతున్నాయి. బంగారం కోసం అత్తను కోడలు హత మార్చిన సంఘటన గాంధారి మండలంలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, గాంధారి : నేటి కలియుగంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగ జారిపోతున్నాయి. బంగారం కోసం అత్తను కోడలు హత మార్చిన సంఘటన గాంధారి మండలంలో చర్చనీయాంశంగా మారింది. గాంధారి ఎస్సై ఆంజనేయులు, గ్రామస్తులు తెలిపిన వివరాలప్రకారం.. మండలంలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ (73) కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు కుమారుల్లో పెద్ద కొడుకు, నడిపి కొడుకు మృతి చెందగా చిన్న కుమారుడు హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. నడిపి కుమారుడైన భూమయ్య భార్య కోటవ్వకు మృతురాలు రుక్మవ్వకు అనేకసార్లు బంగారం, డబ్బుల విషయం లో గొడవలు జరిగాయని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో అత్త దగ్గర ఉన్న బంగారం తో పాటు నగదును కాజేయాలనే ఉద్దేశంతో ఆదివారం తెల్లవారుజామున అత్త రుక్మవ్వ నిద్రిస్తుండగా.. ఆమెపై బండ రాయితో దాడి చేసిన అనంతరం అత్త మెడలోని బంగారు గుండ్లను, చెవి కమ్మలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. రుక్మవ మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదాశివనగర్ సీఐ సంతోష్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం హత్యకు గల వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మృతురాలు కోడలు రుక్మవ్వ పై అనుమానం రావడంతో మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






